ప్రకాష్ అంబేద్కర్ కేసీఆర్ ని పొగడడం దళితులకు అవమానం – మల్లు రవి

-

అంబెడ్కర్ 125 అడుగులు విగ్రహం ఆవిష్కరణకు మేం వ్యతిరేకం కాదు.. కానీ ఆయన రాసిన రాజ్యాంగం తిరిగిరాస్తా అని కేసీఆర్ అన్నారు.. దానిని నేను ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. భారతదేశం అంతా కుటుంబం అని రాజ్యాంగం చెబుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబెడ్కర్ ఛైర్మన్ గా ఉన్న కమిటీతో కలిపి రాజ్యాంగం రాయించిందని.. రిజర్వేషన్ లు కల్పించిందన్నారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి SC, ST సబ్ ప్లాన్ నిధులను BRS ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు పెట్టింది..? ఎంత కారిఫార్వర్డ్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ సొంత డబ్బు ఖర్చు పెట్టి.. విగ్రహ ఆవిష్కరణ చెయ్యలేదు కదా…? ప్రజల సొమ్ముతోనే పెట్టారని అన్నారు. కాంగ్రెస్ దళితులకు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిందన్నారు మల్లు రవి. కేసీఆర్ దళిత వ్యతిరేకి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగానే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి మీ పార్టీ నాయకులకి అప్పగించి.. దళితులకి అందులో చదివే అవకాశం లేకుండా చేసారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. రిజర్వేషన్ ప్రకారం 22% అంటే 44 వేల ఉద్యోగాలు రావాలన్నారు.

డిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టగానే కెసిఆర్ మంచివాడు అయిపోయాడని ప్రకాష్ అంబేద్కర్ చెప్పడాన్ని తాను అంగీకరించనని అన్నారు మల్లు రవి. మేము అంబెడ్కర్ గారి వారసులమే.. ఆయన ఆలోచనాలకు మేమే వారసులం అన్నారు. కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయం గురించి ప్రకాష్ అంబేత్కర్ మాట్లాడాలన్నారు. ప్రకాష్ అంబేద్కర్ కేసీఆర్ ని పొగడటం దళితులకు అవమానం అని.. దీనికి అయన క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version