Maa Elections: చ‌ల్లార‌ని మా వార్‌..! మరో బాంబ్ పేల్చిన ప్రకాష్ రాజ్..!!

-

Maa Elections: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. ఈ పోరులో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. దీంతో మంచు ఫ్యామిలీ..ఆయనకు సపోర్ట్ చేసిన సినీ సెలబ్రీటీస్ సంబరాలు చేసుకుంటున్నారు.

కానీ, ఎవరూ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్‌ మా సభ్యత్వానికి రాజీనామా చేసారు. తెలుగు వాడిని కాకపోవడం నా తప్పు కాదంటూ రాజీనామా చేసేశారు. కానీ, ఆయన రాజీనామాను ఆమోదించలేదు నూత‌న అధక్ష్యుడు మంచు విష్ణు. ఎన్నికల స‌మ‌యంలో ఎన్నో అనుకుంటాం..అవన్నీ అక్కడితోనే మర్చిపోవాలి. మీరు పెద్దవారు. మీ స‌పోర్టు నాకు కావాలి. త్వరలోనే మిమ్మల్నీ డైరెక్టుగా కలిసి మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు.

అయితే.. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ త‌న రాజీనామా వెనుక ఓ లోతైన అర్థమే ఉందంటూ.. మరో బిగ్ బాంబ్ పేల్చారు. ట్వీట్టర్ వేదికగా..‘మాకు మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’..
మాకు అందించిన ప్రేమాభిమానాల విషయంలో మన టీం ఎంతో బాధ్యతగా ఉంది. అలాంటి వారిని ఎప్పుడూ నిరాశపరచం’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు.

దీంతో ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ ని ఎవరైనా బలవంతంగా రాజీనామా చేయమని చెప్పారా అనే డౌట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version