మెడికల్ విద్యార్థి ప్రీతి మృతి చెందినట్లు ప్రకటించారు నిమ్స్ వైద్యులు. నిన్న రాత్రి 9:10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రీతిని బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం.. కానీ ప్రాణాలు కాపాడలేకపోయామంటూ రిపోర్టు లో తెలిపారు నిమ్స్ వైద్యులు. ఇక ఈ సంఘటనపై ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి కీలక ప్రకటన చేశారు.
బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమని చెప్పారు ఎర్రబెల్లి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని.. సీఎం కేసీఆర్ గారు ఆవేదన, విచారం వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.