సరూర్ నగర్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ కొనసాగుతుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న ఆమె నేరుగా సరూర్ నగర్ సభకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతను ఎలా ఆదుకుంటామో తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో 5 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు..మీరు తెలంగాణను తల్లిలా భావిస్తారని.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి అంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణ కోసం కలలు కన్నారని.. అమరవీరుల ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నేల కోసం వందలాది మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు. మీరు తెలంగాణను తల్లిలా భావిస్తారని.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి అంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కలలు కన్నారని.. అమరవీరుల ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నేల కోసం వందలాది మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు.