కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీనియర్ నేత బీవీ రాఘవులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు. అదానీ ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్రం నోరు విప్పడం లేదన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కేంద్రంపై అనుమానం కలుగుతోందన్నారు. అదానీని రక్షించేందుకు మోడీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
తక్షణమే అదానీ ముడుపుల అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు.మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాక కూడా 55 లక్షల ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అదానీ నుంచి వైసీపీ అధినేత జగన్‌కు లంచాలు అందాయనే ఆరోపణలు వస్తున్నా.. జగన్‌ను ఈడీ 0ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ లంచాల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు.