బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి

-

ఇటీవలే మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకుని లండన్ నుంచి తిరిగొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి బీజేపీలో చేరికపై చర్చించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.అంతేకాదు, తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని కమల దళంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.

 

Capt Amarinder Singh all set to join BJP, merge his Punjab Lok Congress with saffron party- The New Indian Express

కేంద్ర మంత్రుల నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదిరులు అమరీందర్ సింగ్ కు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించిన అమరీందర్ సింగ్. అనూహ్యరీతిలో సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమరీందర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గతేడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news