ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా సోమవారం వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. వైసీపీ సర్కారు తీరును నిరసిస్తూ విపక్ష టీడీపీ సభ్యులు నిత్యం ప్లకార్లులు పట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయన తన భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఈ వినూత్న నిరసనకు టీడీపీ అగ్ర నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వహించారు.