స్టిల్ ప్లాంట్ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో పురంధేశ్వరి చర్చలు

-

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ పార్టీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టిల్ ప్లాంట్ అభివృద్ధిపై రాష్ట్ర బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కుమార స్వామితో పురంధేశ్వరి సమావేశం అయ్యి స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆయనతో చర్చించారు.

కాగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడంపై గత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో స్టీల్ ప్లాంట్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. 2019లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తు్న్నట్లు అప్పటి కేంద్రప్రభుత్వం ప్రకటన చేయడంతో రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ ఆందోళన చేపట్టారు. అయితే ఆ సమస్య అలానే ఉండిపోయింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై హామీలు ఇచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version