PUSHPA : పుష్ప నుంచి ఫోర్త్‌ సింగిల్‌.. ”ఏయ్‌ బిడ్డ ఇది నా అడ్డా” అంటూ అల్లు అర్జున్‌ రచ్చ !

-

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కు పుష్ప టీం మరో బిగ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసిన పుష్ప టీం… తాజాగా మరోపాట అప్డేట్ ఇచ్చింది. పుష్ప నుంచి ఫోర్త్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం. నవంబర్ 19వ తారీఖున.. ఈ ఫోర్త్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ను వదిలింది.

“ఏయ్‌ బిడ్డ ఇది నా అడ్డా” అంటూ సాగే ఈ పాటను నవంబర్ 19న విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించారు. ఇక ఈ అప్డేట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో మూడో సినిమా గా పుష్ప తెరకెక్కుతోంది. ఇక ఈ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సరసన.. టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version