హైదరాబాద్‌కు చేరుకున్న తెలుగు తేజం పీవీ సింధు

-

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ సారి కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసింది. అయితే.. ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఆటగాళ్ల సత్తా చాటారు. భారత్‌కు ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 22 స్వర పతకాలు దక్కాయి. అయితే.. ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు గోల్డ్‌ సాధించింది. అయితే.. కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు.. హైదరాబాద్ కు చేరుకుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ సింధుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి సింగిల్స్ లో పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఫైనల్లో కెనడా షట్లర్ మిషెల్లి లీపై గెలిచిన గోల్డ్ మెడల్ అందుకుంది. 2014 కామన్వెల్త్ లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు..ఇప్పుడు అదే షట్లర్ పై గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. కామన్వెల్త్ లో బంగారు పతకం సాధించి తెలుగువారు గర్వపడేలా చేసింది సింధు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version