ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే : ఆర్‌.కృష్ణయ్య

-

జయహో బీసీ జెండాలు, హోర్డింగ్‌లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం సిద్ధమైంది. అయితే.. ఈ సభలో పాల్గొన్న బీసీ ఉద్యమ నేత, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే అని వైఎస్‌ఆర్‌సీపీ జయహో మహాసభలో ఉద్ఘాటించారాయన.

R Krishnaiah demands release of police constable results

బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభలో ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్‌.. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దే. బీసీ బిల్లు వస్తే.. మన(బీసీలను ఉద్దేశించి..) తల రాతలు మారిపోతాయి.  ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు. ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు. సీఎం జగన్‌ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నారు. మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడదని, చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి(సీఎం జగన్‌) మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్‌ కృష్ణయ్య.. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news