పవన్‌ కోసం రాధా… తెరవెనుక ఏం జరుగుతోంది?

-

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి….ఇప్పటికే పాతుకుపోయి ఉన్న వైసీపీ, టి‌డి‌పిలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ని ముందుపెట్టి రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారం కమ్మ, రెడ్ల మధ్యే నడిచేది.

pawan-kalyan
pawan-kalyan

కానీ కాపులకు సైతం అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పవన్ ముందడుగు వేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇటీవల ఆయన చేసే రాజకీయం బట్టి చూస్తే ఇదే అర్ధమవుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు జనసేనకు సత్తా చాటే ఛాన్స్ లేదు. అందుకే చంద్రబాబుతో కలిసే రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్ సైతం…జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు గానీ…ఇన్నేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుని ఒక్క మాట అనడం లేదు.

అయితే ఏది ఎలా చేసినా నెక్స్ట్ టి‌డి‌పితో కలిసి అధికారం దక్కించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే టి‌డి‌పికి ఒంటరిగా జగన్‌ని ఢీకొట్టే సత్తా లేదు. అటు జనసేనకు ఆ సత్తా అసలు లేదు. కాకపోతే రెండు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందే అని చెప్పొచ్చు. అందుకే ఆ దిశగానే రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపులని తమ వైపుకు తిప్పుకునేందుకు బాబు-పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య కాపుల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది.

వైసీపీకి కాపులని దూరం చేయాలని గట్టి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అందులో భాగంగానే కాపుల పెద్దలు పవన్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొదట నుంచి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..పవన్‌కు మద్ధతుగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. ఇక కాపు వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వంగవీటి ఫ్యామిలీ నుంచి రాధా సైతం పవన్‌కు మద్ధతుగా నిలబడటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక పవన్‌తో కలిసి రాధా రాజకీయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కాపులని పూర్తిగా జగన్‌కు దూరం చేయడంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news