వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మరోసారి ర్యాగింగ్.. అమిత్ షా, మోడీకి ట్వీట్

-

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. దీనిపై ఓ విద్యార్థి ఏకంగా ప్రధాని మోడీ అలాగే మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. కాకతీయ వైద్య కళాశాలలో రెండు రోజుల కింద విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి నాలుగో సంవత్సరం విద్యార్థులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సుమారు 50 మంది పైగా వచ్చారు. అయితే ఈ ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది.

థర్డ్ ఇయర్ విద్యార్థులు తమను గౌరవించడం లేదని సీనియర్లు ఆగ్రహించారు. అలాగే ఆ విద్యార్థుల పై దురుసుగా ప్రవర్తించారు సీనియర్లు. అయితే దీనిపై ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ విద్యార్థి పలు ఆరోపణలు చేశారు. “కే ఏంసి లో ర్యాగింగ్ తరహా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి కాపాడండి. వారం తప్ప తాగి జూనియర్ మెడికొల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంత వరంగల్ కేఎంసీ లోని న్యూసెన్స్ హాస్టల్ -1 లో జరుగుతోంది. దయచేసి కాపాడండి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీ అలాగే వరంగల్ సిపి ల తో పాటు మరో ఎనిమిది మందిని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version