మధ్యప్రదేశ్ ఖర్గోన్ లో శ్రీరామ నవమి వేడుకల్లో రాళ్లు రువ్విన తర్వాత అందుకు కారణమైన నిందుతుల ఆస్తులను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దవ్యోల్బనం, నిరుద్యోగంపై దేశ ప్రజలు అలసిపోయారని.. ఈసమస్యలపై బీజేపీ బుల్డోజర్లు నడపాలని వ్యాఖ్యానించారు. బీజేపీ బుల్డోజర్లు విద్వేషం, భయోత్పాతం ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ నగరంలో శ్రీరామనమవి వేడుకలు, ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటన ఘర్షణలకు దారి తీసింది. ఈ అల్లర్లలో ఎస్పీ,6గురు పోలీసులతో సహా 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 80కి పైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఘర్షణలకు పాల్పడిన వ్యక్తుల ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.