కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష బరిలో నిలిచేది ఎవరనే దానిపై యావత్ దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది. పార్టీ నూతన అధ్యక్షుడు ఎన్నికను అక్టోబర్ 17న అన్ని రాష్ట్రాలలోని పీసీసీల్లో నిర్వహించనున్నారు. అధ్యక్ష పదవి రేసులో తాను లేనట్టు రాహుల్ గాంధీ సంకేతాలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాహుల్ గాంధీ పై విమర్శనాత్మకంగా స్పందించారు.
రాహుల్ గాంధీకి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. పార్టీని నడపడానికి అవసరమైన పరినితి రాహుల్ గాంధీకి వచ్చేంతవరకు కుర్చీలో తాత్కాలికంగా కూర్చునే వ్యక్తి కోసం అన్వేషించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వెనుకున్న ఉద్దేశం అని వివరించారు. ఏ పార్టీకి కూడా రెండు శక్తి కేంద్రాలు ఉ0డజాలవని అభిప్రాయపడ్డారు. పీవి నరసింహారావు పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరును తెలుగు ప్రజలు మరిచిపోలేరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
The Elections for the Congress President is basically a search for a person to warm the chair till @RahulGandhi becomes mature enough to take over. No party can have 2 power centres. The Telugu people cannot forget the treatment given to PV Narsimha Rao garu.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2022