బీజేపీ బాగోతం బయటపడుతుందనే.. ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వెళితే.. బీజేపీ బాగోతం బయటపడుతుందని ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మత విద్వేషాల నుంచి  ఈ దేశ ప్రజల చూపు మరల్చడానికి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారని ఆరోపించారు. మోదీ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ బయపడదని అన్నారు. 14 ఏళ్ల నుంచి ఈడీ కేసును క్లోజ్ చేసిన తర్వాత మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. బీజేపీ అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని పిలిచి అవమానిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకుండా ఆస్పత్రిలో ఉంటే అర్థరాత్రి వరకు విచారిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. మోదీ, అమిత్ షాలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీజేపీ గాంధీ కుటుంబం వెంటుక కూడా పీక లేరని సవాల్ విసిరారు. బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ ను అడ్డుకుంటున్నారని అన్నారు. మోదీ, అమిత్ షాలు మనస్తత్వం నేరగాళ్ల మనస్తత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. మీ రాక్షస ఆనందానికి అంతిమ గడియలు వచ్చాయని అన్నారు. మీరుండేది ఇంకా రెండేళ్లే అని గుర్తు చేశారు. అధికారులు మీ బాధ్యతలను దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష అనుభవించాల్సిందే అనే హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version