రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పైన గాంధీ భవన్ లో సమీక్ష చేశారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ లో రాహుల్ గాంధి భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. 15 రోజుల పాటు తెలంగాణ లో రాహుల్ యాత్ర ఉండనుందని… 2 సార్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ లో మక్తల్ నియోజక వర్గం లో పాదయాత్ర ప్రారంభం కానుందని… జుక్కల్ నియోజక వర్గంలో ముగింపు ఉంటుందని పేర్కొంది. యాత్ర రూట్ పైన చర్చిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు..రాహుల్ గాంధీ ప్రసంగంపైన చర్చించారు. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు.. పాల్గొన్నారు. ఏఐసీసీ నుంచి యాత్ర పర్యవేక్షకులుగా బైజు, సుశాంత్ మిశ్రా వచ్చారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గం నుంచి నాయకులు ప్రజలు పాల్గొనేలా ప్రణాళిక వేసింది కాంగ్రెస్.