ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలను వాతావరణ శాఖ జారీ చేయగా.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ.
మిగతా చోట్ల స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే.. తెలంగాణలో సైతం మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. నిండుకుండలా మారిని జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.