మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

-

మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్ లో ఆడేందుకు రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. అబుదాబి టి 10 లీగ్ లో రైనా పాల్గొననున్నాడన్నది ఆ వార్త సారాంశం.

అంతే కాకుండా ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నట్లు అతడి అభిమానులు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగారన్ కూడా తమ నివేదికలో పేర్కొంది. “నేను ఇంకా రెండు మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తర ప్రదేశ్ లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అనుమతి ధ్రువీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్ లలో ఆడేందుకు సముకత చూపిస్తున్నాను” అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగారన్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version