మునుగోడులో రాజకీయాలు వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చండూరు పట్టణంలో గెలిచిన ఈ పోస్టర్లలో రూ. 18 వేల కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
మరోవైపు రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోయారని టిఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా తాను స్నానం చేసి తడి బట్టలతో బిజెపికి అమ్ముడు పోలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. కెసిఆర్ నీవు, నీ కొడుకు కేటీఆర్ తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాక్షిగా నేను స్నానం చేసి తడి బట్టలతో లక్ష్మీనరసింహ సాక్షిగా బిజెపికి అమ్ముడు పోలేదని నేను ప్రమాణం చేసేందుకు సిద్ధం.
కెసిఆర్ నీవు & నీ కొడుకు (కేటీఆర్ ) తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా???
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 11, 2022