నీట్ ఫలితాల్లో రాజస్థాన్ విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్

-

నీట్‌(యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి రాత్రి విడుదల చేశారు. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన వత్సా ఆశిష్‌ బాత్రా రెండవ స్థానం పొందాడు.

గత ఏడాది ఇది 56.34 శాతంగా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఓబీసీలు 45.03%, ఎస్సీలు 13.26%, ఎస్టీలు 4.76%, జనరల్‌ 28.41%, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 8.46% మంది ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 68,061 మంది అభ్యర్థులు నమోదు చేసుకొని పరీక్షకు 65,305 మంది హాజరయ్యారు. అందులో 40,344 మంది (61.77%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 61,207 మంది పేర్లు నమోదుచేసుకోగా, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27%) మంది అర్హత పొందారు.
జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. తొలి 50 ర్యాంకుల్లో ఎనిమిది స్థానాలు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్‌ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version