సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఈ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ ల కలయికలో వస్తున్న తొలి ఫుల్ లెంగ్త్ చిత్రం ఇది. కాగా, మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ చిత్రం చేయడం తనకు చాలా గొప్ప విషయమని, ఇది తాను గుర్తుంచుకునే సినిమా అని రామ్ చరణ్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ‘ఆచార్య’ సెట్స్ నాటి థ్రో బ్యాక్ వీడియో ఒకటి షేర్ చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఆ వీడియోలో రామ్ చరణ్ తన గెటప్ లో హాయిగా ‘ఆచార్య’ సెట్ లో కూర్చొని ఉన్నాడు. తన వద్దకు వచ్చిన వన్యప్రాణులకు ఫుడ్ పెడుతున్నాడు. కొద్ది సేపు మేక పిల్లను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత కుక్క పిల్లలకు ఫుడ్ పెట్టాడు. అటుగా ఓ కోడి వచ్చి పేపర్ ప్లేటులో పోసిన నీళ్లు తాగుతుంది.
అలా హాయిగా రామ్ చరణ్ ‘ఆచార్య’ సెట్ లో టైం స్పెండ్ చేస్తుండగా, చిరంజీవి రామ్ చరణ్ ను చూసి మురిసిపోయి ఫొటోలు తీస్తున్నాడు. అలా పుత్రోత్సాహంతో మురిసిపోయాడు మెగాస్టార్. ఈ చిత్రంలో వీరిరువురు ‘భలే భలే బంజారా’ సాంగ్ కు చిందేశారు. ఈ సాంగ్ వీడియో కోసం మెగా అభిమానులు, సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.