టార్గెట్ బాబు: వర్మ సంచలనం.. వైసీపీ స్కెచ్?

-

ఎప్పుడు వివాదాల్లో ఉండే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంపై తాజాగా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎక్కువమంది జనాలు పెద్ద గ్రౌండ్‌లో పెడితే రారని.. పాపులారిటీ తగ్గిపోతుందని అందరికి తెలిసిపోతుందనే భయంతో చంద్రబాబు ఇలా చేశారని,  చెప్పుకొచ్చారు. అలాగే వచ్చినవాళ్లకు చంద్రబాబు కానుకల పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు పిలిచారని వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోటో షూట్ కోసం పిలిచి.. అది పూర్తి అవ్వగానే చంద్రబాబు వెళ్లిపోయారన్నారు.

పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అని, రాజకీయ నాయకుడికి ప్రజల సంక్షేమం ముఖ్యమని, వారిని చంపి.. శవాలపై నిల్చుని పాపులారిటీ పెంచుకోవడం దారుణమని వర్మ కామెంట్ చేశారు. అయితే వరుసగా వైసీపీ నేతలు ఇదే తరహా విమర్శలు గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై చేస్తున్నారు. ఇప్పుడు వర్మ అవే విమర్శలు చేశారు. ఆ ఘటనలు ఎలా జరిగాయి..వాటికి బాబు బాధ్యత తీసుకుని, బాధిత కుటుంబాలని ఎలా ఆదుకున్నారనే విషయం ప్రజలకు తెలుసని, కానీ ఈ ఘటనల్లో వైసీపీ కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

అయితే వర్మ రాజకీయ నాయకుడు కాదని, అలాంటప్పుడు రెండువైపులా ఆలోచించాలని, అలా కాకుండా వైసీపీ వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి..వర్మ వైసీపీ స్క్రిప్ట్ ఫాలో అయిపోయారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వర్మపై విరుచుకుపడుతున్నారు.

గత ఎన్నికల్లో ముందు వర్మ వైసీపీ ఎలా సహకారం అందించారో తెలుసని, వైసీపీలో వర్మ కూడా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఇటీవల జగన్‌ని కలిసి వ్యూహం అనే సినిమా తీయడానికి సిద్ధమవుతున్న విషయం తెలుసని, ఇక పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారే వర్మ..పబ్లిసిటీ గురించి మాట్లాడటం పెద్ద వింత అని అంటున్నారు. ఎంతైనా వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి..ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలని చూస్తున్నారని టీడీపీ శ్రేణులు వర్మపై మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news