సాధారణంగా దర్శకులకు అనుగుణంగా హీరోలు తమ మేకోవర్ ను చేంజ్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా ఏకంగా రాజమౌళి సినిమా యమదొంగ కోసం 30 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఈయనే కాదు మరి ఎంతోమంది హీరోలు కూడా పాత్రలు డిమాండ్ చేస్తే ఆ పాత్రలకు తగ్గట్టుగా తమ శరీర ఆకృతిని మార్చుకోవడానికి కూడా వెనుకాడడం లేదు అని చెప్పవచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కదా కొన్ని కేజీలు బరువు పెరిగినట్టు.. ఇప్పుడు రామ్ పోతినేని కూడా తన బరువును పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే రామ్ పోతినేని ఇటీవల తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ సినిమా దివారియర్ సినిమా బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఈ క్రమంలోనే రామ్ తన ఆశలన్నీ బోయపాటి శ్రీను మీదనే పెట్టుకున్నాడు. ఎందుకంటే దివారియర్ సినిమా డిజాస్టర్ కావడంతో బోయపాటి సినిమా అయినా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఉండడం గమనార్హం. ఇప్పటికే బోయపాటి సినిమాతో పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసి సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.