రంజాన్: ఈద్ ముబారక్.. విశేషాలు.. వాట్సాప్ మెసేజీలు.. కొటేషన్లు..

-

ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ పర్వదినం గురించి విశేషాలు తెలుసుకుందాం. 30రోజుల కఠిన ఉపవాస దీక్షని ఈ రోజు విరమిస్తూ తీపి పదార్థాలతో పండగ చేసుకుంటారు. రంజాన్ పండగ ఈ సంవత్సరం మే 14న జరుపుకుంటారు. భారత దేశ ప్రజలు రంజాన్ పండగని సౌదీ అరేబియాలో జరుపుకున్న ఒకరోజు తర్వాత జరుపుతారు. ఈ పవిత్ర మాసంలో 30రోజుల తర్వాత చంద్రుడు కనిపించిన మరుసటి రోజు పండగ చేసుకుంటారు.

రంజాన్ నెలలో నిస్వార్థంగా, తమని తాము పరిశీలించుకుంటూ ఇంత ఆనంద ప్రదమైన జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కఠిన ఉపవాసాలతో దీక్షలు పడతారు. రంజాన్ పర్వదినాన ఆ ఉపవాసాలకి విరామం ఇస్తారు. ఈ పవిత్రమైన రోజున మీ బంధువులకు, స్నేహితులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? ఐతే ఈ కొటేషన్లు చూడండి.

” మీ జీవితంలో ఆనందం ఒక వరదలా వచ్చి మీతోనే ఉండిపోవాలని, ఎల్లప్పుడూ సంతోషమనే వర్షంలో తడుస్తూ ఉండాలని, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్”.

“ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో సరైన దారిని చూపించి మిమ్మల్ని, మీతో పాటు కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని కోరుకుంటూ ఈద్ ముబారక్”.

“నువ్వు ఆనందంగా ఉండడానికి లక్ష కారణాలను ఈ పవిత్ర పర్వదినం చూపిస్తుందని, ఆ ఆనందాన్ని ఈ పర్వదినం మరింత రెట్టింపు చేస్తుందని, చేయాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు”.

“మహమ్మారి సమయంలో భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నియంత్రణ నియమాలు పాటిస్తూ సంతోషంగా పర్వదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు”.

Read more RELATED
Recommended to you

Exit mobile version