కన్న తండ్రి కామవాంఛ… సొంత కూతురిపైనే అత్యాచారం

-

పశువాంఛ తీర్చుకోవడానికి కామంధులు ఎంతకైనా తెగిస్తున్నారు. వావీవరసలు మరిచి చిన్నాపెద్దా తారతమ్యాలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు నిర్భయ, దిశ, ఫోక్సో వంటి ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా… కామాంధులు అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. సొంత కూతుళ్లను కూడా వదిలిపెట్టడం లేదు కొంతమంది దుర్మార్గపు తండ్రులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే.. కన్న కూతుళ్ల జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్ వడోదరకు చెందిన ఓ వ్యక్తికి కన్నకూతురు(17)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కొన్నేళ్ల క్రితం బాలిక తల్లి మరణించింది. దీంతో బాలిక తండ్రి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే కూతురుపై కన్నేసిన సదరు తండ్రి.. వావీవరసలు మరిచి కూతురుపైనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను మేనత్త ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక 18 వారాల గర్భవతి అని తేలింది. బాలికతో పాటు మేనత్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 2021 నుంచి తనపై అత్యాచారం జరుగుతుందని బాలిక పోలీసులకు వెళ్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version