గోల్డ్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రాకు అరుదైన గౌర‌వం

-

టోక్యో ఓలింపిక్స్ గోల్డ్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రాకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. నీర‌జ్ చోప్రాకు కేంద్ర ప్ర‌భుత్వం విశిష్ట మెడ‌ల్ తో స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. రేపు జ‌ర‌గ‌బోయే గ‌ణ‌తంత్ర ఉత్స‌వాల్లో నీర‌జ్ చోప్రాకు కేంద్ర ప్ర‌భుత్వం విశిష్ట మెడ‌ల్ పుర‌ష్కారంతో స‌త్క‌రించ‌నుంది. నీర‌జ్ చోప్రాకు రేపు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ విశిష్ట సేవా ప‌త‌కాన్ని అందించ‌నున్నారు. కాగ రేపు ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో గ‌ణ‌తంత్ర వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు.

గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా నీర‌జ్ చోప్రా ఆర్మీలో సుబేదార్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. దీంతో నీర‌జ్ చోప్రాకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ పుర‌ష్కారంతో స‌త్క‌రించ‌నుంది. అలాగే ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ర‌క్ష‌ణ సిబ్బందికి గ్యాలంట‌రీ స‌హా ఇత‌ర అవార్డుల‌ను కేంద్రం అందించ‌నుంది. అయితే నీర‌జ్ చోప్రా టోక్యో ఓలింపిక్స్ లో జూవెల‌న్ త్రో విభాగంలో గోల్డ్ మెడ‌ల్ సాధించిన విష‌యం తెలిసిందే. భార‌త దేశానికి సుమారు 100 సంవ‌త్స‌రాల త‌ర్వాత అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన రికార్డును నీర‌జ్ చోప్రా సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version