ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ను ప్రకటించిన కాసేపటికే ఆల్రౌండర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు… మహమ్మద్ నబీ కి టీం కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
అయితే… ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పై అసంతృప్తితోనే రషీద్ ఖాన్ తన కెప్టెన్సీ కి రాజీనామా చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టు ఎంపికలో తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని అసంతృప్తికి గురయ్యాడు రషీద్ ఖాన్. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రషీద్ ఖాన్. ఇక 2013 – 14 మధ్య టీ 20 కెప్టెన్ గా ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ఉన్నాడు. ఇక తాజాగా రషీద్ ఖాన్ తప్పుకోవడం తో.. మరోసారి మహమ్మద్ నబీ.. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టానున్నాడు. కాగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.