నేటి తరం హీరోయిన్ లు సినిమాల పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ నిజజీవితంలో మాత్రం వారు స్నేహితుల్లా కలిసి ఉంటున్నారు. తాజాగా రష్మిక మందన ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి సమంత తనదైన రీతిలో స్పందించండి. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అసలు విషయంలోకి వెళితే… రష్మిక మందన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో రష్మిక మందన పింక్ కలర్ జర్కిన్‌ను ధరించి మిర్రర్ ముందు నిల్చొని ఉంది. ఇలా రష్మిక పెట్టిన ఈ పోస్టుకు సహా నటి అయిన సమంత కామెంట్ చేసింది. సమంత చేసిన కామెంట్ కు స్పందిస్తూ రష్మిక మందన క్యూట్’ అనే క్యాప్షన్‌తో పాటు లవ్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో వీరిద్దరూ నటించారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ పాత్రలో నటించింది. సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వీరిద్దరు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస క్రేజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.