రూ.2వేల నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ

-

రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా శుక్రవారం రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసే సదుపాయం ఏప్రిల్ 01న మూసివేయనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐకీ చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం నుంచి నోట్లు తీసుకోవడం ప్రారంభం అవుతుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 19 ఇష్యూ కార్యాలయాల్లో ఖాతాల వార్షిక ముగింపునకు సంబంధించి కార్యకలాపాల కారణంగా రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం ఏప్రిల్ 01, 2024న అందుబాటులో ఉండదని పేర్కొంది ఆర్భీఐ. మే 19, 2023న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్లను చెలామణి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 29 నాటికి, రూ.2000 నోట్లలో దాదాపు 97.62 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి.

ఈ నోట్లలో కేవలం రూ.8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల మధ్య చెలామణిలో ఉన్నాయి. తమ రూ.2000 నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి పంపించే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version