RC 16 : రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్?

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటించనున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుచ్చిబాబు సాన తెరకెక్కించనున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు.

RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా సినిమా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.కిలారు వెంకట సతీశ్‌ నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version