ట్రెండ్ ఇన్: RC 15తో శంకర్ కమ్స్ బ్యాక్..అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ RC15 అని చెప్పొచ్చు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ఇది. కాగా, ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఇటీవల కాలంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి శంకర్ తన సినిమా స్థాయి ఏంటో మాటలతో కాకుండా చేతలతోనే చూపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు అందించిన స్టోరిని తనదైన శైలిలోకి మార్చుకుని ఎక్సలెంట్ గా శంకర్ ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు వినికిడి.

ఈ సినిమాపైన మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. కాగా, ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెవర్ బిఫోర్ రోల్స్ ప్లే చేస్తున్నారు. IAS, IPS ఆఫీసర్ తో పాటు పొలిటీషియన్ రోల్ ప్లే చేస్తున్నారట. ఇప్పటికే రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. కాగా, ఈ చిత్ర అప్ డేట్ ఇవ్వాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #RC15 ఆర్సీ 15 హ్యాష్ ట్యాగ్ ను వరుసగా ట్వీట్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో కొద్ది సేపు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ పైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news