నిరుద్యోగులకు శుభవార్త.. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

-

నేను పదో తరగతి మాత్రమే చదువకున్నా.. నాకేం ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పదో తరగతి అర్హతతో కూడా పోస్టులు ఉన్నాయి. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్​(ఎస్​ఎస్​సీ) సెలక్షన్​ పోస్టు ఫేజ్​ 10 నోటిఫికేషన్​ విడుదలైంది. పది, పన్నెండు, డిగ్రీ ఉత్తీర్ణతతో మొత్తం 2,065 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ww.ssc.nic.in అధికారిక వెబ్​సైట్​లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆగస్టులో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియ మే 12నే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేది జూన్ 13. దరఖాస్తు రుసుం రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

SSC Recruitment 2019: Good news job applicants! SSC to offer over 1 lakh jobs for these posts; check details | Career News – India TV

ఈ విడతలో మొత్తం 2,065 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్​ఎస్​సీ. అభ్యర్థులు విద్యార్హతను బట్టి ఆయా పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జీతం పోస్టుల ఆధారంగా రూ.5,200 నుంచి రూ.34,800 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్​ఎస్​సీ సెలక్షన్ పోస్టులో పదో తరగతి విద్యార్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్​, లాస్కార్​-I, ఎం.టి హెల్పర్​, మెడికల్ అటెండెంట్​ వంటి పోస్టులు ఉంటాయి.పన్నెండో తరగతి విద్యార్హతతో స్టోర్ కీపర్, ఎఎస్​ఐ(రేడియో టెక్నీషియన్), కానిస్టేబుల్(ఫొటోగ్రాఫర్), ఫార్మసిస్ట్​(అలోపథిక్​), హెడ్​ కానిస్టేబుల్​(స్టోర్​ క్లర్క్​) వంటి పోస్టులుంటాయిడిగ్రీ, ఆపై ఉత్తీర్ణతతో రీసెర్చ్ ఎనలిస్ట్, కెమికల్ అసెస్టెంట్​, గర్ల్ క్యాడెట్ ఇన్​స్ట్రక్టర్​, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్​, జూనియర్ జియోగ్రాఫికల్ ఇంజినీర్ వంటి పోస్టులుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news