మీరు ఏదైనా మంచి టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టీవీ గురించి చూడాల్సిందే. రెడ్ మీ తాజా స్మార్ట్ TV సిరీస్ రెండు మోడళ్లను అందిస్తుంది. ఫీచర్స్ కూడా బాగున్నాయి. 32-అంగుళాల HD TV మరియు 43-అంగుళాల పూర్తి HD టీవీ ని ఇస్తోంది రెడ్ మీ. అయితే ఈ రెండు కూడా ఆండ్రాయిడ్ టీవీలు. ఈ రెండూ కూడా ఆండ్రాయిడ్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తాయి. IMDb రేటింగ్ ఇంటిగ్రేషన్ తో సరి కొత్త PatchWall 4 UIని తీసుకువస్తాయి.
ఇమేజ్-ప్రాసెసింగ్ అల్గారిథమ్, వివిడ్ పిక్చర్ ఇంజిన్‌కు ఈ టీవీ సపోర్ట్ ని ఇస్తుంది. సౌండ్ విషయానికి వస్తే.. రెండు స్మార్ట్ టీవీలు డాల్బీ 5.1 సరౌండ్ సౌండ్ సెటప్‌తో డాల్బీ ఆడియోను కలిగి వున్నాయి. కలర్ విషయానికి వస్తే.. గరిష్టంగా 16-మిలియన్ కలర్ ని ఉత్పత్తి చేయగలవు. ఇక వీటి ధరల వివరాల లోకి వెళితే.. Redmi TV 43 23,999 గా వుంది.
ప్రాక్టికాలిటీ తో పాటుగా చాలా అవసరమైన ఫీచర్లు, దృఢత్వం మరియు కనెక్టివిటీ ఫీచర్లను ఇది కలిగి వుంది. ఇది వాల్-మౌంట్ లేకుండా కూడా వస్తుంది. బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్‌ను కూడా ఈ టీవీ కలిగి ఉంది. సెట్-టాప్ బాక్స్‌లను కనెక్ట్ చేయడానికి 2x HDMI పోర్ట్‌లు, బ్లూ-రే ప్లేయర్‌లు మరియు గేమింగ్ కన్సోల్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి పోర్ట్‌లు మరియు 3.5తో సహా అన్ని కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా ఈ టీవీలు కలిగి వుంది.
ఆప్టికల్ అవుట్ లేదు. పోర్ట్ మరియు రెండు HDMI పోర్ట్‌లతో మాత్రమే వస్తుంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు సెటప్ బాక్స్‌లలో 1080p కంటెంట్ ప్లేబ్యాక్ కోసం చాలా బాగా టీవీ పని చేస్తుంది. Redmi TV 43 1GB RAM మరియు 8GB కలిగి ఉంది, అందులో 4.3GB మీడియా కంటెంట్‌ను స్టోర్ చేయడానికి అందుబాటులో ఉంది.