సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు ఎవరంటే..?

-

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి , ప్రశాంత్ నీల్ వంటి స్టార్ దర్శకులకు.. హీరోల కంటే కూడా ఎక్కువ పారితోషికం ఇస్తారు అని చెప్పడంలో సందేహం లేదు.. ఇదే నిజమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేసే రేంజ్ లో సినిమాలను ఈ దర్శకులు అందిస్తున్నారు. కాబట్టి వీరు అందించే సినిమాలు వరల్డ్ క్లాస్ టైప్ లో ఉంటాయి . కాబట్టి దర్శకులు ఆ మాత్రం పారితోషికం తీసుకోవటంలో తప్పులేదు అని చెప్పవచ్చు. ఈ టాలీవుడ్ డైరెక్టర్ లు బాలీవుడ్ ను సైడ్ చేయడమే కాకుండా బాలీవుడ్ సినీ ప్రేక్షకులను కూడా టాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూసేలా చేస్తున్నారు మన సౌత్ దర్శకులు. వీరు తమ సినిమాలతో సౌత్ సినిమా రూపురేఖలను మార్చేస్తున్నారు . ఇకపోతే సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

రాజమౌళి:

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో రాజమౌళి పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాకు 120 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటారు. లాభాల్లో వాటా కూడా తీసుకోవడంతోపాటు మొత్తంగా రూ.150 కోట్ల వరకు అందుకుంటారు.

ప్రశాంత్ నీల్ :

కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాకు గాను ఆయన ఏకంగా 80 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం . ఇక లాభాలలో వాటాలలో కలుపుకుని మొత్తం రూ.100 కోట్ల వరకు అందుకున్నారట.

రోహిత్ శెట్టి :

బాలీవుడ్ స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఒక్కో సినిమాకు రూ. 40 కోట్ల పారితోషికం తీసుకుంటారు. ఇక సినిమా లాభాల వాటా మొత్తం రూ. 50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

రాజ్ కుమార్ హిరానీ:

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈయన సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటారు. కాకపోతే లేటుగా సినిమాలు చేస్తూ ఉంటారు.

శంకర్:

ప్రస్తుతం శంకర్ రూ.35 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.

త్రివిక్రమ్:

రూ.30 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version