ఎన్నికలవేళ రాష్ట్రంలో ఇంకొక కీలక పరిణామం చోటుచేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు శుక్రవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఇలా ఆయన కలవడంతో కచ్చితంగా పార్టీ మార్పు ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది తాజాగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు అంతకు ముందు ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ కర్మగారాలు పారిశ్రామిక శిక్షణ సంస్థల శాఖ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.