మధ్యయుగపు రాచరిక చక్రవర్తుల్లా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు : రేవంత్‌ రెడ్డి

-

కేసీఆర్ చేసిన దాని కంటే ఇచ్చిన కూలీ ఎక్కువైందంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఢిల్లీ కెళ్ళి లిక్కర్ లో పెట్టుబడులు పెట్టేంత వ్యాపారాన్ని విస్తరించారు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ 60ఏళ్ళల్లో ఆంధ్రోళ్లు కూడా ఇంతలా అణచివేయలేదు.. ఒకప్పుడు ఉస్మానియాలోకి రావాలంటే పోలీసులు బయపడేవాళ్లు.. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.. దీనికి కారణం ఎవరు.? మధ్యయుగపు రాచరిక చక్రవర్తుల్లా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు.. నక్సలైట్లల ఎజెండానే నా జెండా అన్నావు.. ఏమైంది.? మీ కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ నక్సలైట్లల ఎజెండాలో ఉంది.? ఉద్యోగాలు ఇవ్వవొద్దని ఏఎజెండాలో ఉంది.? స్వేచ్ఛ సామజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడిన్రు.. అసెంబ్లీ నుంచి ఉస్మానియా వరకు నిజాంలే కట్టిన్రు.. అభివృద్ధి కార్యక్రమాలే ప్రామాణికమైతే ఎందుకు సాయుధ పోరాటం చేశారు.? సీమాంధ్రులను సరిహద్దులు దాటించిన చరిత్ర తెలంగాణది.. రాష్ట్రంలో సామజిక న్యాయం ఎక్కడుంది.? నీ సామజికవర్గానికి పదవులు ఇస్తే అయిపోతుందా.?

Revanth Reddy: Who fought in the movement.. dominance

సామజిక న్యాయం లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదు.. 100ఏళ్ల ఉస్మానియా వేడుకలకు వస్తే కనీసం మైక్ కూడా పట్టుకొని పరిస్థితి నీది.! స్వచ్ఛ సామాజిక న్యాయం స్వయంపాలన కోసం మళ్ళీ తెలంగాణలో అలజడి మొదలవుతుంది.. దాంట్లో నువ్వు కాలిబూడిది అవుతావు.. అరవై కోట్ల రూపాయలతో ప్రారంభమైన అమరుల స్థూపం ఇప్పుడు 200కోట్లు అంటున్నారు.. అమరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా ప్రొద్దుటూరు వ్యక్తికి ఇచ్చినవ్.. ఆరేళ్ళయింది ఇంకా పూర్తి కాలేదు.. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చినవ్.. చినజీయర్ స్వామి చెప్పినట్టు చేసినవ్.. కనీసం తెలంగాణ అమరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా తెలంగాణ వ్యక్తికి ఇవ్వలేని దౌర్భాగ్యం ఉంది.. ‘ అని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news