కేటీఆర్ మునుగోడు దత్తత పేరుతో నాటకాలు ఆడుతున్నారు – రేవంత్ రెడ్డి

-

మంత్రి కేటీఆర్ మునుగోడు దత్తత పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ దత్తత పేరుతో కొడంగల్ ప్రజలను మోసం చేశాడని.. ఇప్పుడు మునుగోడుకు వచ్చి అవే మాయ మాటలు చెబుతున్నాడని మండిపడ్డారు. చిన్న మూల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ ను కెసిఆర్ దత్తత తీసుకొని ఏమి చేయలేదని మండిపడ్డారు.

రేపో మాపో సీఎం కేసీఆర్ మునుగోడు కు వస్తారని.. కుర్చీ వేసుకుని కూర్చుని మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు కలిసి కాంగ్రెస్ ను అంతం చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన దాహం, కాంట్రాక్టుల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు భవిష్యత్తు కోసం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version