నేడు గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో కొందరు చేరారు. అయితే.. కొత్త కాంగ్రెస్‌లోకి వస్తున్న వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారికి స్వాగతమన్నారు. కక్ష పూరిత చర్యలతో ఎమ్మెల్యే లను కేసీఆర్ చేర్చుకున్నా… పార్టీకి అండగా కొట్లాడుతున్నారు భట్టి విక్రమార్క అంటూ కొనియాడారు. నాకు సోనియా గాంధీ గొప్ప అవకాశము ఇచ్చారన్న రేవంత్.. ప్రధాని..సీఎం పదవి కంటే… పీసీసీ గొప్ప పదవి అని వ్యాఖ్యానించారు. జీవితాంతం సోనియా గాంధీ.. రాహుల్‌లకు విశ్వాస పాత్రుడుగా పని చేస్తానన్నారు.
రాముడుకి హన్మంతుడు అండగా ఉన్నట్టు రాహుల్ గాంధీకి అండగా ఉంటానని, రావణాసురుని చంపడం కోసం ఎంత దూరమైన వెళ్తానన్నారు. ధరణి పోర్టల్ దరిద్రంగా మారింది.. దాన్ని రద్దు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ మీద కక్ష గట్టి ఈడీ కేసులు పెట్టారని, వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని.. మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చారు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు.