కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తాం – రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశ భద్రత ఆందోళనకరంగా ఉంది, చైనా 2 వేల కి.మీ చొచ్చుకు వచ్చినా ప్రధాని ఏమి చేయలేదు….ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఆర్ధిక వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఫైర్‌ అయ్యారు. రాహూల్ జోదో యాత్ర తో ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించాడని..తెలంగాణను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చిన్నాభిన్నం చేస్తున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి.

కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లు అయింది….మార్పు కోసం యాత్ర మొదలుపెట్టానని..ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేసిఫెస్టో విడుదల చేస్తామన్నారు. రేపు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందని..గిరిజన సోదరులు యాత్రను విజయవంతం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 8 శతాబ్దాల నాటి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినా… రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని..తెలంగాణ వారసత్వ సంపదని కాలగర్భంలో కలపాలని కేసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version