కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచితే…. తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలకు సహయం అందించకుండా… ప్రజలు సంపాదించిన సంపదను దోచుకునేందుకు జేబు దొంగల్లాగా మోదీ, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా… యూనిట్ కు 50 పైసల నుంచి రూపాయి దాకా పెంచడం ద్వారా దాదాపు రూ. 5596 కోట్ల రూపాయను పేదల నుంచి గుంజుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. సర్ ఛార్జీల పేరుతో మరో రూ. 6వేల కోట్లను వసూలు చేస్తోందని… రాష్ట్ర ప్రజలపై భారం మోపుతుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యుత్ సంస్థలు నష్టాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని విమర్శించారు. రూ .12.5 వేల కోట్ల అప్పు ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితాల పేరుతో అందిస్తున్నామని చెబుతన్న విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను చెల్లించాలి. బిల్లులు కట్టే వారిపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. కేంద్రం డిజిల్, పెట్రోల్ పై రోజురోజు రేట్లు పెంచుతున్నాయని… ఎన్నికల సమయంలో నాలుగున్నర నెలలు నుంచి ధరలను పెంచని కేంద్రం.. ఈరోజు డిజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచాయని విమర్శించారు. జీడీపీ పెంచుతమని బీజేపీ ప్రభుత్వం చెబితే… గ్యాస్, డిజిల్, పెట్రోల్ పెరగడం అని ఎద్దేవా చేశారు.
మోదీ, కేసీఆర్ జేబుదొంగల లాగా ప్రజల్ని దోచుకుంటున్నారు. : రేవంత్ రెడ్డి
-