ఆర్జీవీ అద్భుత ట్వీట్‌.. ఆకలి, చావు, ప్రేమ.. ప్రకృతి తీరు

-

వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన దైన శైలితో సినిమాలు చేస్తూ.. వెరైటీ కామెంట్లు ఆయన సొంతం. అయితే.. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఫోటో ప్రకృతి తీరు అద్దం పట్టేలా ఉంది. ప్రకృతి ఎంత అందమైనదో అంత క్రూరమైనది కూడా. ఒక ప్రాణి ఆకలి తీర్చుకోవడానికి మరొకటి ప్రాణం కోల్పోక తప్పదు. ఫలితం ఆ ప్రాణిని నమ్ముకున్న కుటుంబం ఆగమవుతుంది. ఇదే విషయాన్ని ప్రతిబింబించే వీటన్నింటిని తెలిపే ఒక ఫొటోని టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ఆకలి, మరణం, ప్రేమ, ఏమీ తెలియని అమాయకత్వం ఒకే ఫొటోలో.. ప్రకృతి కంటే క్రూరమైనది ఏదీ లేదు’ అని ఆ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు.

ఎప్పుడూ వివిధ అంశాలపై వివాదాస్పద ట్వీట్లు చేసే ఆర్జీవీ పెట్టిన ఈ ట్వీట్.. అందరి హృదయాల్ని కదిలిస్తోంది. అడవిలో చిరుత ఓ కోతిని వేటాడి నోటితో కరిచి తీసుకెళ్తుంటుంది. చిరుత పక్కనున్నా.. తల్లి ప్రాణం పోయినా అవేవీ తెలియని పిల్ల కోతి, అమ్మను హత్తుకొని ఉంటుంది. ఒకే టైంలో ఆకలి, చావు, ప్రేమ, అమాయకత్వం ఈ ఫొటోలో కనిపిస్తున్నాయి. ఫొటో పాతదే అయినా.. ఆర్జీవీ చెప్పిన అర్థం బాగుందని నెటిజన్లు ట్వీట్‌కి రిప్లై ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news