తమ వైవాహిక సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అక్కినేని చైతన్య , సమంత ఇవాళ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చాలా చర్చలు , ఆలోచనల తర్వాత సామ్ , నేను సొంత మార్గాలను ఎంచుకోవడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నాగ చైతన్య ప్రకటించారు. మేము ఒక దశాబ్దానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం అదృష్టంగా బావిస్తున్నానని పేర్కొన్నాడు.
ఇదే విషయాన్ని సమంత కూడా చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇది ఇలా ఉండగా వివాదాస్పద ఆ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక పోస్టులో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
” పెళ్లిళ్ల ను కాదు… విడాకులను సెలబ్రేట్ చేసుకోండి. వివాహమనేది చావు… విడాకులు అంటే మళ్ళీ పుట్టడం” అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. దీనిపై ఆయన విశ్లేషించిన ఓ పాత వీడియోను చూడాలని లింకు కూడా ఈ ట్వీట్ కు యాడ్ చేశాడు రాంగోపాల్ వర్మ. అయితే సమంత మరియు నాగచైతన్య విడాకుల గురించే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు అని నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.
Not Marriages, Divorces should be celebrated..Marriage is death and Divorce is rebirth💐💐💐 https://t.co/87HKdcAQ6L via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2021