మరో 48 గంటల్లో తేలనున్న రిషబ్ పంత్ భవితవ్యం…. గంగూలీ కీలక వ్యాఖ్యలు..!

-

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ 2022 సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో ఢిల్లీ నుంచి రూర్కీ ఇంటికి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో రిషబ్ పంత్ 2022 నుంచి క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉంటున్నాడు. కారు ప్రమాదం తర్వాత కోలుకున్న పంత్, ఇప్పుడు వచ్చే ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడబోతున్నాడు.దీని కోసం అభిమానులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అందుకే నేషనల్ క్రికెట్ అకాడమీ పంత్ కి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తుంది.

rishab panth

రిషబ్ పంత్ ఫిట్‌నెస్ పరీక్ష మార్చి 5న జరగనుంది. దీని తర్వాత మాత్రమే మేం పంత్ కెప్టెన్సీ కోసం బ్యాకప్ ఎంపికను పరిశీలిస్తామం అని తెలిపారు. మేం పెద్దగా హైప్ సృష్టించకుండా,అతని ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version