ఇంగ్లండ్ తో ఇప్పటికే టెస్టు సిరీస్ ను గెలవడంతో చివరి టెస్టులో టీమ్ ఇండియా పలు మార్పుల్ని చేసేందుకు సిద్ధమవుతోంది. విరామం లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ కి విశ్రాంతి ఇచ్చి, 100వ టెస్టు ఆడనున్న అశ్విన్ కు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రోహిత్ స్థానంలో పడిక్కల్ ఓపెనింగ్కు వస్తారని తెలుస్తోంది. దీంతో అశ్విన్, జడేజా తప్పితే దాదాపు కుర్రాళ్ల జట్టుతోనే ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే….ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇంకా సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడా తో సిరీస్ ని సొంతము చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 ని స్కోర్ చేసింది రెండవ ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు ని నష్టపోయి 192 పరుగులు చేసింది .