Akash Puri:” కామెంట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి స‌మాధానం చెప్తా..” పూరి కొడుకు ఎమోష‌నల్ స్పీచ్!

-

Akash Puri: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించాడు. ఇప్ప‌డూ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా రొమాంటిక్ అంటూ మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆకాష్ పూరి జంట‌గా.. కేతిక శర్మ న‌టిస్తుంది.

ఈ సినిమాకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ త‌రుణంలో హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ ఉద్వేగానికి లోన‌య్యారు. తన తాత సింహాచలం నాయుడు
పేరు ఎవరికీ తెలియ‌దు. కానీ, తన పేరు.. ఈ రోజు అందరికీ తెలుసని అన్నారు. ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా.. క‌ష్టప‌డి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. ఆ రోజు సింపథీ చూపించారు. ఒక ఫెయిలైతే.. కనీసం మనిషిగా కూడా చూడరని అన్నాడు.

ఈ క్ర‌మంలో త‌న నాన్నకు ఫెల్యూర్స్ వ‌చ్చాయ‌ని.. ఇక పూరి కెరీర్‌ అయిపోయిందని అన్నారు. కానీ, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఆయన ఊపు అందుకున్నారు. త‌న‌ నాన్న పరిశ్రమ కోసం ఎంతో ఇచ్చారనీ, తాను కూడా పరిశ్రమలో పుట్టి పెరిగాన‌నీ. త‌న‌ నాన్న పరిశ్రమకి ఇచ్చినదానికంటే ఇంకో శాతం ఎక్కువే ఇస్తానని అన్నారు. త‌న‌ నాన్న కాలర్‌ ఎగరేసేలా చేయడమే త‌న‌ లక్ష్యమ‌న్నారు. త‌న నాన్నను కామెంట్ చేసిన వాళ్లకు తాను సమాధానం చెబుతానని పూరి ఆకాశ్ అభిప్రాయపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version