కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి రోస్ అవెన్యూ కోర్టు నోటీసు

-

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి రోస్ అవెన్యూ కోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత అభ్యర్థించారు. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 12కి వాయిదా వేసింది.

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఢిల్లీ తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసినా దర్యాప్తు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అభ్యంతరం తెలపడంతో అనేక మార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత తాజాగా దాఖలు చేవారు. జూలై 12న ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version