RRR : ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డు.. 1.5 మిలియ‌న్ ప్రీ బుకింగ్

-

మెగ ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీ స్టార‌ర్ గా న‌టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25 న పాన్ ఇండియా రెంజ్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా విడుద‌లకు ముందే.. రికార్డుల‌ను కొల్ల కొడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనూ ప‌లు రికార్డుల‌ను సృష్టిస్తుంది. అంతే కాకుండా.. ఓవ‌ర్సీస్ లోనూ ఆర్ఆర్ఆర్ ర‌చ్చ మాములుగా లేదు. కాగ తాజా గా ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లకు ముందే.. అరుదైనా రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాను 1.5 మిలియన్స్ మంది అభిమానులు ప్రీ బుకింగ్ చేసుకున్నార‌ని తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రీ బుకింగ్ 2 మిలియ‌న్స్ ను అందుకునేందుకు రెడీ గా ఉంద‌ని అంటున్నారు. కాగ ఈ సినిమా ప్రీ బుకింగ్ బుక్ మై షో ద్వారా అందిస్తుంది. కాగ నాలుగు ఏళ్ల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు కోసం ఎదురు చూస్తున్న మెగా , నంద‌మూరి, రాజ‌మౌళి అభిమానులు ప్రీ బుకింగ్ కోసం ఎగ‌బ‌డుతున్నారు.

కాగ రామ్ చ‌ర‌ణ్, తార‌క్, రాజ‌మౌళి కాంబో లో వ‌స్తున్న ఈ సినిమాకు విప‌రీత‌మైన అంచ‌నాలు ఉన్నాయి. అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌లు, ట్రైల‌ర్ తో పాటు చిత్ర బృందం చేస్తున్న‌ప్ర‌మోషన్స్ తో ఈ సినిమాకు క్రేజ్ భారీ గా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version