తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు అమలుకు నిధులు విడుదల చేసింది. రూ. 500 కోట్లు విడుదల చేస్తూ కేసీఆర్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పైలెట్ ప్రాజెక్టుకు తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. హుజరాబాద్ నియోజకవర్గం లో సంతృప్త స్థాయిలో తెలంగాణ దళిత బంధు అమలు కానుంది. ఈ దళిత బంధు పథకం ప్రకారం ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయల చొప్పున నిధులు పంపిణీ చేయనుంది సర్కార్. హుజూరాబాద్ నియోజకవర్గం లోని దళిత కుటుంబాల అన్నిటికీ ఈ దళిత బంధు పథకం నిధులు అందనున్నాయి.