ఏపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా దీపం(ఉచిత గ్యాస్) పథకం కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలోనే దీపం పథకానికి రూ.895 కోట్లను చంద్రబాబు సర్కార్ కేటాయింపులు చేసింది.ఇక దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యమని ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఎండగడుతూనే ఆర్థిక,ద్రవ్య లోటును ప్రత్యేకంగా ప్రస్తావించారు.